మున్నూరుకాపు మహిళా పరస్పర సహాయ వినియోగదారుల సహకార సంఘం లిమిటెడ్
(మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ)
పంట ఉత్పత్తిదారులకు- వినియోగదారులకు మధ్యలో ఎలాంటి దళారులు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడమే ఈ సొసైటీ ఉద్దేశ్యం) తమ పంటలకు దళారుల కమీషన్ కటింగ్ లేకుండా మంచి ధర వస్తే రైతులు సంతోషిస్తారు. మనకు కూడా రైతుల పంట పొలం నుంచే డైరెక్టుగా కల్తీలేని సరుకులు అందుతాయి. దీంతో మన ఆరోగ్యాలు బాగుంటాయి. అదే సమయంలో మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ సభ్యులైన మహిళలు కూడా తమ కాళ్లపై తాము నిలబడి, ఆర్థికంగా స్థోమత పెంచుకునే అవకాశం కలుగుతుంది.
ఈ “ప్రజా బజార్” మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న మన కుటుంబాల వారికి నాణ్యమైన నంబర్ 1 బియ్యం, కంది పప్పు, పెసర పప్పు, శనగపప్పు, చింతపండు, కారం, పసుపు తదితర నిత్యావసర వస్తువులను నేరుగా అందించవచ్చు. సంస్థ మనుగడకోసం ఇతర కులాల వారికి కూడా ఈ సేవలు అందించే అవకాశం ఉంది.
సభ్యత్వం చేరుటకు (కేవలం మహిళలు మాత్రమే), మరియు ఆన్లైన్ లో షేర్లు కొనడానికి ఈ క్రింద ఉన్న బటన్ నొక్కి కొనవచ్చును.
ఎటువంటి సలహా, లేదా సందేహం ఉన్నా, సీఈఓ/ చైర్ పర్సన్/ డైరెక్టర్ లని సంప్రదించవచ్చును.
ఆఫ్ లైన్ లో, అనగా డైరెక్ట్ గా చేరుటకు, షేర్లు కొనుటకు, ఆఫీస్ కి వచ్చి సీఈఓ/ చైర్ పర్సన్/ డైరెక్టర్ లని గారిని కలిసి ఈ క్రింది ఫారం ఫిల్ చేసి ఇవ్వవలసి ఉంటుంది.

