మున్నూరుకాపు మహిళా పరస్పర సహాయ వినియోగదారుల సహకార సంఘం లిమిటెడ్

(మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ)

About MACCS Ltd.,

పంట ఉత్పత్తిదారులకు – వినియోగదారులకు  మధ్యలో  దళారులు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడమే మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ ఉద్దేశ్యం

మన మున్నూరు కాపులంతా రైతు కుటుంబాల వారే. మనలో అత్యధికశాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు.  అయితే, కరువు కాటకాలను, వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎండనకా, వాననకా, రాత్రింబవళ్లూ రైతు కుటుంబమంతా పొలంలో కష్టపడితేనే పంట పండుతుంది.  ఇంత శ్రమించాకనే పంట చేతికొస్తది. కానీ, చేతికొచ్చిన ఆ పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధరలు రాక అందరికీ అన్నంపెట్టే మన రైతులు.. చివరకు అన్నమో రామచంద్రా అని దు:ఖించే పరిస్థితి వస్తున్నది.

ఇవాళ ఈ దేశంలో అన్ని వస్తువులను తయారు చేసే వారికి ఆ వస్తువులకు ధర నిర్ణయించి అమ్ముకునే హక్కు ఉంటుంది. కానీ, మన రైతులకు మాత్రం ఆ హక్కు లేదు. రైతులు ఎంత కష్టపడి పంటలు పండించినా, మార్కెట్ కు తీసుకొచ్చే సరికి ధరను నిర్ణయించేది మాత్రం మధ్య దళారులు, పంటను కొనుగోలు చేసే వ్యాపారులే. అంతే కాదు, రైతుల పంటలను తక్కువ ధరకు కొన్న  ఆ వ్యాపారులు అక్రమ సంపాదన కోసం, అందులో ఎంత వీలైతే అంత కల్తీ చేసి వినియోగదారులకు అమ్ముతుంటారు. దీంతో ఇన్నాళ్లూ ఉన్న ఊళ్లల్లో  ఉండి, ఉద్యోగాల కోసం, బతుకుదెరువు కోసం నగరాలకు వచ్చి కిరాయి ఇండ్లల్లో నివసిస్తున్న మనం కూడా ఏమీచేయలేక వ్యాపారులు అమ్మే కల్తీ సరుకులనే కొనుక్కొని తినాల్సిన దుస్థితి వచ్చింది. అటు మన రైతుల పంటలకు సరైన ధర రాదు, ఇటు మనకు అందేవి కూడా కల్తీ సరుకులే కావడంతో ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇందులో బాగుపడేది మాత్రం అవినీతితో కల్తీ చేసే మధ్య దళారులైన వ్యాపారులే.

ఈ దుస్థితిని రూపుమాపి, అటు రైతుల పంటలకు మంచి ధరను అందించాలని, ఇటు వినియోగదారులకు కూడా తక్కువ ధరల్లో కల్తీలేని పంట సరుకులని నేరుగా అందించాలని గొప్ప సంకల్పం తీసుకున్నది మన మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ. అదే రైతు పంట పొలం నుంచి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను… నేరుగా తక్కువ ధరలో ప్రజలకు అందించాలన్నదే మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ ఉద్దేశ్యం.

Registration Number: 

TG/RRD/MACS/2024-88/CONSU

NGO Darpan Registration Number:

TS/2024/0469414